31-12-2025 01:47:11 AM
మహబూబ్‌నగర్ జిల్లా ఉడిత్యాలలో ఘటన
మహబూబ్‌నగర్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): పింఛన్ డబ్బుల కోసం కన్న తల్లిని కొడుకు చంపిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని బాలనగర్ మండ లం ఉడిత్యాల గ్రామంలో జరిగింది. ఉడిత్యాల గ్రామానికి చెందిన హనుమమ్మ (75) కు కుమారుడు ఆంజనేయులు ఉన్నాడు. అయి తే మద్యం కోసం ఈ నెల హనుమమ్మకు వచ్చిన పింఛన్ డబ్బుల నుంచి వేయి రూపాయలు తీసుకున్నాడు. మంగళవారం మరిన్ని డబ్బులు ఇవ్వాలని అడుగగా.. నా దగ్గర లేవు అని చెప్పడంతో ఆంజనేయులుకు ఆవేశంతో బండరాయితో హను మమ్మను కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే హనుమమ్మ మృతి చెందింది. దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై లెనిన్ తెలిపారు.