calender_icon.png 4 December, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత మేలుకో రిమోట్ గుర్తు గుర్తుంచుకో

04-12-2025 08:53:50 AM

జగదేవపూర్: జగదేవపూర్ మండల పరిధిలోని మునిగడప గ్రామంలో ప్రజా సేవకులు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పేదింటి బిడ్డ పబ్బ హరి గౌడ్ రిమోట్ గుర్తుకే ఓటు వేయాలని మొదటి రోజు గ్రామంలో ప్రచారం చేసారు. మీ బిడ్డగా ఈ గ్రామంలో పుట్టి పెరిగిన ప్రతి సమస్యపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తూ ఇంటింటి ప్రచారం కొనసాగించారు. వారితోపాటు బిఆర్ఎస్  నాయకులు గుర్రం శ్రీనివాస్, పబ్బ రవి గౌడ్, నర్రా బిక్షపతి,తుప్ప నాగరాజు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులున్నారు.