calender_icon.png 4 December, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన పాఠశాల.. పశువుల పాకలో చదువు సాగేది ఎలా...

04-12-2025 08:27:28 AM

గిరిజన విద్యార్థుల పరిస్థితి అద్వానం.. నైతం రాజు..

 బెజ్జూర్, (విజయక్రాంతి): కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండలంలోని పాత సోమినిలో పాఠశాల లేక పశువుల పాక ముందు చెట్టుకింద చదువులు సాగుతున్నాయి. గిరిజన ఆదివాసి నాయకుడు నైతం రాజు విద్యార్థులు చెట్టు కింద కూర్చుని విద్యనభ్యసిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు స్వాంతంత్రం వచ్చిన ఆదివాసీల తలరాతలు మారలేదని నేటికీ గిరిజన ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. విద్యా, వైద్యం, రోడ్లు, తదితరఅనేక సౌకర్యాలు లేవు అని అన్నారు. వర్షాకాలంలో ఓర్రెలు ఉప్పొంగినట్లయితే ఉపాధ్యాయులు పాఠశాలకు రాలేని పరిస్థితిగా మారుతుందని అన్నారు.

సమస్యలతో ఉన్న పట్టించుకొనే నాధుడు లేరని, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆసిఫాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు నైతం రాజు పర్యటించి, సందర్శించి గ్రామస్తుల తో సమస్యలు తెలుసుకున్నారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన విద్యార్థులకు పాఠశాల భవనం లేక పశువుల పాక లో విద్యాబోధన కొనసాగుతుందని, విద్యార్థులు వర్ష కాలంలో తడుస్తూ, పశువుల పాక లో చదువు కుంటున్నారని, ఎప్పుడు విష పురుగుల వల్ల ప్రమాదం జరుగుతుందని భయందోళనతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని విద్యార్థుల తల్లి తండ్రులు ఆవేదన చేస్తూ ఉపాధ్యక్షులు రాజు కు విన్నవించారు, అధ్యక్షులు మాట్లాడుతూ ఇట్టి విషయం స్థానిక నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఆయా శాఖల అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదని అగ్రహించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు స్పందించి వెంటనే విద్యార్థుల భవిష్యత్తు కై, విద్యాబోధన కు పాఠశాల భవనం మంజూరు చెసి ఆదుకోవాలని వేడుకున్నారు.. ఈ కార్యక్రమం లో గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.