22 August, 2026 | 2:46 PM

Breaking News

జీవో నెం. 97ను వెంటనే రద్దు చేయాలంటూ నిరసన

22-08-2026 01:37 PM

అశ్వారావుపేట,(విజయక్రాంతి): పాలిటెక్నిక్ విద్యార్థుల(Polytechnic students) భవిష్యత్‌ కు నష్టం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 97 ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగ కాంతారావు(Rega Kanta Rao) పిలుపుమేరకు విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌ ను దెబ్బతీసే జీవో 97 ను వెంటనే రద్దు చేయాలి డిమాండ్ చేస్తూ.. అశ్వారావుపేట లోని స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క విషయంలో ఒంటెద్దు పోకడగా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నారని, విద్యార్థుల జీవితాల పట్ల కనీస అవగాహనతో ఆలోచించ కుండా విద్య వ్యవస్థను ఇష్టం వచ్చినట్టు మార్చేసి జీవోలను విడుదల చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే ప్రతిపక్ష పాత్ర లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేతులు కట్టుకొని ఉండదని విద్యార్థుల కొరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.

తక్షణమే ప్రభుత్వం వెంటనే ఈ జీవో 97 ను వెనక్కి తీసుకోవాలి.

డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు నేరుగా బీటెక్ సెకండ్ ఇయర్‌ లో చేరే లేటరల్ ఎంట్రీ (ECET ద్వారా) అవకాశం యథావిధిగా కొనసాగించాలన్నారు. జీవో ప్రకారం మళ్లీ ఇంటర్మీడియట్ చదివి ఎంసెట్ రాయాల్సి వస్తే విద్యార్థులు మూడు సంవత్సరాల చదువు వృధా అవుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మండల కో ఆర్డినేటర్ జూపల్లి రమణరావు, మున్సిపాలిటీ కౌన్సలర్ ఉదయ జ్యోతి, అచ్యుతాపురం ఉప సర్పంచ్  పాకనాటి నాగేశ్వరరావు, నారాంవారి గూడెం  ఉప సర్పంచ్ రాంబాబు,మాజీ ఎంపీపీ జల్లి పల్లి శ్రీరామమూర్తి, యు ఎస్ ప్రకాష్ రావు,మందపాటి రాజా మోహన్ రెడ్డి, నారం రాజశేఖర్, కాసాని చంద్రమోహన్, భూక్యా.ప్రసాద్, జుజ్జురపు.శ్రీరామమూర్తి, సత్య వరపు సంపూర్ణ, జజ్జురపు వెంకన్నబాబు,కలపాల.దుర్గయ్య,ధర్మ, వెంకన్నబాబు, అంజి,కుప్పాల.కృష్ణ,కలపాల.సురేష్,లింగంకుంట.కృష్ణ, ఉస్మాన్ అశ్వారావుపేట మండల నాయకులు కార్యకర్తలు,మాజి ప్రతినిధులు ,విద్యార్థి విభాగం,యువజన విభాగం నాయకులు అభిమానులు విద్యార్థులు పాల్గొన్నారు.