22 August, 2026 | 3:26 PM

బెల్లంపల్లిలో జూనియర్ సివిల్ కోర్టును ప్రారంభించిన హైకోర్టు జడ్జి

22-08-2026 02:44 PM

బెల్లంపల్లి, (విజయ క్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నూతనంగా నిర్మించిన జూనియర్ సివిల్ కోర్టు భవనాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయ మూర్తి నాగేశ బీమపాక ప్రారంభించారు. కన్నాల జాతీయ రహదారి పక్కన రూ. 5 కోట్ల 60 లక్షల నిధులతో కోర్టు భవనం నిర్మించారు. మందమర్రి నూతనంగా ఏర్పాటు చేసిన కోర్టు ను ప్రారంభించిన అనంతరం హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక బెల్లంపల్లి కి వచ్చారు. ఆయనకు కోర్టు వద్ద బెల్లంపల్లి సివిల్ కోర్టు న్యాయ మూర్తి శాంతి సోనీ, న్యాయ వాదులు వేదపండితులు వేదమంత్రాలు, గుస్సాడి గిరిజన కళాకారుల నాట్యం మధ్య ఘనంగా స్వాగతం పలికారు. కోర్టు భవనం ఆవిష్కరణ అనంతరం హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి వీరయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, జిల్లాలోని న్యాయ వాదు లు పాల్గొన్నారు.