22 August, 2026 | 2:04 PM

విద్యార్థులకు అండగా V2 ఫౌండేషన్

22-08-2026 01:30 PM

ఎనకపల్లి పాఠశాలలో బ్యాగుల పంపిణీ

నాగల్ గిద్ద,ఆగస్టు 22(విజయక్రాంతి): నాగలగిద్ద మండలంలోని ఎనకపల్లి ఎంపీపీ‌ఎస్ పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో V2 హెల్ప్ యూ ఫౌండేషన్ – “ది గ్రూప్ ఫర్ నీడీ” ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠశాల బ్యాగులను పంపిణీ చేశారు. ధివ్యా మేడం సహకారం, విరాళంతో పాటు పిఆర్‌టియు నాగలగిద్ద మండల అధ్యక్షులు ఎస్. రమేష్ చొరవతో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు చదువుకు అవసరమైన బ్యాగులను అందజేశారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు విద్యా సామగ్రిని అందించడం ద్వారా వారి చదువుకు తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

బ్యాగులు అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృష్ణ ప్రసాద్, నవీన్, రవీందర్, సావిత్రి తదితరులు పాల్గొని తమ సహకారం అందించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి V2 హెల్ప్ యూ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి, ఉత్సాహాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. రాజు మాట్లాడుతూ విద్యార్థులకు అందించిన బ్యాగులు వారి చదువుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, పాఠశాల తరఫున V2 హెల్ప్ యూ ఫౌండేషన్, ధివ్యా మేడం, ఎస్. రమేష్‌తో పాటు కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.