22 August, 2026 | 3:25 PM

అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ మంచిర్యాల జిల్లా నూతన కమిటీ ఎన్నిక

22-08-2026 02:46 PM

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నౌండ్ల సంతోష్ చారి 30 మంది సభ్యులతో మంచిర్యాల జిల్లా నూతన కమిటీని శనివారం ప్రకటించారు. కమిటీ జిల్లా అధ్యక్షులుగా కోటోజు రమేష్ చారి, ప్రధాన కార్యదర్శిగా గుండోజు రమేష్ చారి, కోశాధికారిగా పండూరి రమణ చారి, సలహాదారుగా బండోజు సాయన్న చారి, ఉపాధ్యక్షులుగా శ్రీరామోజు సంతోష్ చారి, మాటూరి సత్యనారాయణ చారి, కట్ట శ్రీనివాస చారి, అగ్నిమెట్ల శంకరయ్య చారి, శ్రీరామోజి నరసింహ చారి, నూతి తిరుపతి చారి, పెద్దపెల్లి మధు చారి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా తాటికొండ రాజేశం చారి, జాయింట్ సెక్రటరీలుగా పుప్పాల రాజు చారి, బోనాల లక్ష్మీనారాయణ చారి, కొండపర్తి లక్ష్మణాచారి, పాలిక కుమార చారి, రంగు అరుణ్ చారి, పెద్దపేట శ్రీధర్ చారి, జంబోజు తిరుపతి చారి, ప్రచార కార్యదర్శిగా జయరాం చారి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా మల్కోజు తిరుపతి చారి, శ్రీరామోజు రాజమౌళి చారి, శ్రీరామోజు నాగేందర్ చారి, అలుగోజు అనిల్ చారి, తొలికుంట్ల కోటేశ్వర చారి, నౌండ్ల చంద్రమౌళి చారి, ఉప్పల రూపాచారి, జంబోజు రమేష్ చారి, వేల్పుల సంపత్ చారి, తొలికుంట్ల శ్రావణ్ చారిలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సంతోష్ చారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ జాతి అభివృద్ధి కోసం సేవాభావంతో పనిచేస్తున్న వారిని గుర్తించి ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాతి అభివృద్ధికి కృషి చేసే ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో సముచిత గుర్తింపు కల్పిస్తామని పేర్కొన్నారు. నూతన కమిటీ సభ్యులకు పలువురు విశ్వబ్రాహ్మణ కులబంధువులు శుభాకాంక్షలు తెలిపారు.