22 August, 2026 | 3:21 PM

వెంకటరామిరెడ్డి విగ్రహం నెలకొల్పాలని ఏకగ్రీవ తీర్మానం

22-08-2026 02:39 PM

కామారెడ్డి, ఆగస్టు 22 (విజయక్రాంతి): కామారెడ్డిలో రాజాబాహదూర్ వెంకటరామిరెడ్డి విగ్రహాన్ని నెలకొల్పాలని ప్రసన్నాంజనేయరెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. శనివారం కామారెడ్డిలో రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటరామిరెడ్డి తెలంగాణ సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. విద్య సామాజిక అభ్యున్నతికి ప్రజాసేవ రంగాల్లో ఆయన చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజాభివృద్ధి కోసం ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నాంజనేయ రెడ్డి సంఘం అధ్యక్షులు ఎస్ లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామచంద్ర రెడ్డి, ఉపాధ్యక్షులు హనుమంత్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు మల్లేష్ మోహన్ రెడ్డి, కార్యదర్శి సాయిబాబు రెడ్డి, సంతోష్ రెడ్డి, గుర్రం శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు. 


అలాగే  జయంతి సందర్భంగా శ్రీ ప్రసన్నాంజనేయ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డిలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజా బహుదూర్ వెంకటరామిరెడ్డి జయంతి సందర్భంగా కామారెడ్డిలో విగ్రహ ప్రతిష్ట జరపాలని  ప్రసన్నాంజనేయ రెడ్డి సంఘ కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించినారు. కామారెడ్డి ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, ప్రజలు, వివిధ రెడ్డి సంఘాల సభ్యులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నాంజనేయ రెడ్డి సంఘం అధ్యక్షులు ఎస్. లక్ష్మారెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి పి. రామచంద్ర రెడ్డి గారు, ఉపాధ్యక్షులు గుండ్రెడ్డి హనుమంత్ రెడ్డి, గౌరవ సలహాదారులు మల్లేష్ మోహన్ రెడ్డి , కార్యదర్శులు సాయిబాబు రెడ్డి, సంతోష్ రెడ్డి , గుర్రం తినాలి గుర్రం శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి సంఘం సభ్యులు పాల్గొని రాజా బహుదూర్ వెంకటరామిరెడ్డి కి ఘన నివాళులు అర్పించారు.