ఎద్దును ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి
19-08-2026 12:14 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): వరంగల్ జిల్లా నర్సంపేట శివారు రాజుపేట వద్ద 365వ జాతీయ రాహదారిపై బుధవారం ఉదయం కారు ఎద్దును ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందగా మరికొందరు గాయపడగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండ కు చెందిన కొందరు కారులో మేడారంకు వెళ్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగినట్లు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






