2 September, 2026 | 2:43 AM

కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్‌ఎస్ సమరశంఖం

02-09-2026 | 01:50am

కాంగ్రెస్ పాలనపై జిల్లావ్యాప్తంగా నిరసనలకు కోవా లక్ష్మి పిలుపు

ఆసిఫాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభు త్వం ఎన్నికల సమయంలో ఇ చ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఎమ్మెల్యే కోవా లక్ష్మి (MLA Kova Lakshmi) ఆరోపించారు. ప్రభుత్వ 1,000 రోజుల పాలనకు నిరసనగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆమె పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.మంగళవారం క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో సమావేశమైన కోవా లక్ష్మి మాట్లాడుతూ..

ఎన్నికల గ్యారెంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. జిల్లాకేంద్రంలో జరిగే నిరసనకు ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రభుత్వ వైఫల్యాలపై గళం విప్పాలని కోరారు.ఈ సమావేశంలో మార్సుకోలా సరస్వతి, ఆకాష్, అహ్మద్, అలీబిన్ హైమద్, సంజీవ్, రవీందర్, అజయ్ కుమార్, ఇంతియాజ్ లాల, శ్రీధర్ రెడ్డి, హనుమంతరావు, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.