రేవంత్ గుండెల్లో కేసీఆర్ కలవరం..
కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్‌ఎస్ పోరుబాట
కేసీఆర్ పేరు లేకుండా రేవంత్ రెడ్డి ఏ సభ నిర్వహించలేరు
రాష్ట్రంలో తీవ్రమవుతున్న నీటి సమస్యలు, రైతాంగ సంక్షోభంపై ఉదృతంగా బి ఆర్ స్ పోరాటాలు
ఎన్ని ఆటంకాలు సృష్టించినా మిర్యాలగూడలో కేటీఆర్ఆ ధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహిస్తాం.
సూర్యాపేట, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): రేవంత్ గుండెల్లో కేసీఆర్ కలవరం మొదలైందని, కేసీఆర్ ప్రస్తావన లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ఒక్క సమావేశం కూడా నిర్వహించలేకపోతున్నారని మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల వైఫల్య పాలనపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ గుండెల్లో కేసీఆర్ నిద్రిస్తున్నట్లు కలవరిస్తున్నాడని, కేసీఆర్ను అనుక్షణం గుర్తు చేసుకునే వారిలో రేవంత్దే ప్రథమ స్థానమని ఎద్దేవా చేశారు. ఫ్రస్ట్రేషన్ ఎక్కువై సీఎం రేవంత్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, కేసీఆర్ సైన్యం అంటేనే కాంగ్రెస్ నాయకులకు భయం పట్టుకుందని, కేసీఆర్ నడిచే రోడ్డుపై ఎదురువచ్చే దమ్ముందా అని సవాల్ విసిరారు.
మూసీ బ్రిడ్జ్ ఓపెనింగ్లోనూ కేసీఆర్ ప్రస్తావన ఎందుకు తెస్తున్నారని నిలదీస్తూ, సచివాలయానికి రేవంత్ ఎన్నిసార్లు వచ్చారో లెక్క తీద్దామని సవాల్ చేశారు. రాజకీయ భిక్ష పెట్టిన మహబూబ్ నగర్ జిల్లాతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాను ఎండబెడుతూ, వెలుగొండ ప్రాజెక్టు నీళ్లను ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తున్నా అడ్డుకోలేని అసమర్థత ఈ ప్రభుత్వానిదని, కేంద్రానికి ఉత్తరం రాయడానికి వణుకెందుకని ప్రశ్నించారు. ఎడమ కాలువకు నీల్లిమ్మని మాట్లాడే ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లో లేడని, రైతాంగం రక్తం తాగుతున్న దుర్మార్గులు కాంగ్రెస్ నాయకులేనని విమర్శించారు.
రాష్ట్రంలో నీటి సమస్యలు తీవ్రంగా మారుతున్నా,పట్టించుకోకుండా అంతా అవినీతి సొమ్మును లెక్కించే పనిలో ఉన్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు మరియు ముఖ్య నేతలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, రైతాంగ సమస్యలను ఎండగట్టేందుకు రేపటి నుంచే బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట ప్రారంభిస్తామని, ఎన్ని ఆటంకాలు సృష్టించినా మిర్యాలగూడలో కేటీఆర్ ఆధ్వర్యంలో భారీ రైతు ధర్నాను నిర్వహించి తీరుతామని, రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం ఆగదని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, పార్టీ నాయకులు వై వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ, పలువురు నాయకులు పాల్గొన్నారు.






