ఓర్వలేకపోతున్న బీఆర్‌ఎస్
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, మార్చి 16 (విజయక్రాంతి) : గవర్నర్ అంటే బీఆర్‌ఎస్ నేతలకు గౌరవం లేదని, తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి వారు ఓర్వలేకపోతున్నారని అన్నారు. రుణమాఫీ, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు వంటి హామీలను ఇప్పటికే అ మలు చేస్తున్నామని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీఆర్‌ఎస్‌కు తమ ను విమర్శించే నైతిక హక్కు లేదని ధ్వజమెత్తారు.
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మా ట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగం రాష్ట్ర అభివృద్ధికి ఒక రోడ్ మ్యాప్ అని, 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగిందని తెలిపారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాకుండా ఫాం హౌస్ కే పరిమితమవ్వడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. ఆర్థిక వ్యవ స్థ విధ్వంసమైనా, చిక్కుముడులు విప్పుకుం టూ తమ ప్రభుత్వం ప్రగతి పథంలో సాగుతోందన్నారు.
ఎమ్మెల్యే రాంచందర్ నాయక్ మాట్లాడుతూ.. కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక దోపిడీని ప్రజలంతా గమనించారని చెప్పారు. తమ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ ఫలాలను చూసి తట్టుకోలేకనే విపక్షాలు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటున్నాయన్నారు. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలను మానుకొని నిర్మాణా త్మక సూచనలు చేయాలని కోరారు.
ఎమ్మె ల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నాయకుడు లేని పార్టీ అని, ఫాం హౌస్ సంస్కృతికి అలవాటు పడిన వారికి అభివృద్ధి కనిపించదన్నారు. రేవంత్‌రెడ్డిని ఎదు ర్కొనే ధైర్యం లేకనే ప్రతిపక్షాలు డ్రగ్స్, ఇతర అనవసర ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. 420 హామీలంటూ విమర్శించే వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. పదేళ్లలో ఒక్క రేషన్‌కార్డు ఇవ్వని బీఆర్‌ఎస్ నేతలు, తాము ఇస్తున్న సన్నబియ్యం, కార్డుల గురించి మాట్లాడాలన్నారు. మూసీ ప్రక్షాళన నల్లగొండ జిల్లాకు వరప్రదాయిని అని, దీనిపై కేటీఆర్ చేస్తున్నవన్నీ అబద్ధపు ప్రచారాలేనన్నారు. హైదరా బాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు పోతోందని చెప్పారు.




