సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వడగండ్ల వాన
17-03-2026 02:14 AM
కామారెడ్డి/సంగారెడ్డి, మార్చి 16 (విజయక్రాంతి)/నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లాలో సోమవారం సాయం త్రం ఉరుములు, మెరుపులతో కూడిన పొడగండ్ల వాన కురిసింది. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, నిజాంపేట, వట్‌పల్లి, జోగిపేట, సంగారెడ్డి, పటాన్చెరుతో పాటు మెదక్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో వర్షం కురిసింది.
నారాయణఖేడ్‌లో వడగండ్ల వాన కురవడంతో మొక్కజొన్న పంటకు, మామిడి తోటలకు నష్టం జరిగింది. అలాగే కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. వడగళ్ల వాన కురవడంతో మామిడి చెట్ల పూత, మామి డి పిందెలు నేల రాలిపోయాయి.




