29 March, 2026 | 3:05 AM

కాంగ్రెస్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు బీఆర్‌ఎస్ తలొగ్గదు

29-03-2026 01:11 AM
  1. ఇల్లీగల్ క్రషర్లపై విచారణ చేయాల్సిందే

మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ నేతల బ్లాక్ మెయిల్ రాజకీయాలకు బీఆర్‌ఎస్ పార్టీ తలొగ్గదని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీ మీడియా హాల్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన లక్ష ఆరోపణల్లో ఒక్కటంటే ఒక్కటి నిరూపించలేక పోయారని, శాసనసభలో బీఆర్‌ఎస్ నాయకులపై చేసిన ఎదురుదాడిని తీవ్రంగా ఖండించారు.

ఇల్లీగల్ క్రషర్‌పై విచారణ చేయాల్సిందేనని, హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. సీబీ సీఐడీ విచారణ పేరుతో ప్రభుత్వం కుక్క బెదిరింపులు చేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొత్త, పాత బాసుల కుట్రలను కేసీఆర్ నాయకత్వంలో ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. ఆనాడు కేసీఆర్‌ను టార్గెట్ చేశారని, నేడు కేటీఆర్‌ను టార్గెట్ చేశారని మండిపడ్డారు. శాసన సభలో సీపీఐ, బీజేపీ, కాంగ్రెస్ అందరు ఒక్కటే అని విమర్శించారు.