26 June, 2026 | 1:49 AM

శైలజపై అనుచిత వ్యాఖ్యలను ఖండించిన బీఆర్‌ఎస్ మహిళా నేతలు

26-06-2026 12:00 AM

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాగోల్ 

పోలీసులకు ఫిర్యాదు

నాగోల్, జూన్ 25 (విజయక్రాంతి) ః ఎల్బీ నగర్ నియోజకవర్గ సీనియర్ బీఆర్‌ఎస్ మహిళా నాయకురాలు శైలజపై మైనంపల్లి హనుమంతరావు అనుచరులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్‌ఎస్ మహిళా నాయకురాళ్లు నాగోల్ పోలీస్ స్టేష న్లో ఫిర్యాదు చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ మ క్బూల్ జానీకి వినతిపత్రం అందజేసి, మహిళా నాయకురాలి గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా మహిళా నేతలు మాట్లాడుతూ, రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ మహిళల పట్ల అవమానకరమైన భాషను ఉపయోగించడం సమాజానికి మంచిది కాదన్నారు. వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై వెంటనే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ మహిళా అధ్యక్షురాలు రంగేశ్వరి నాయుడుతో పాటు సూరజ్ యస్దాని, రమాదేవి, విజయగౌడ్, దేవి గౌడ్, పార్వతి, కల్పన, మమత, నిర్మల, పద్మ, విజయలక్ష్మి, సరళ, వరలక్ష్మి, నాగమణి, అనురాధ, వీణ, సురేఖ తదితరులు పాల్గొన్నారు.