బీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలు నడుం బిగించాలి
15-06-2026 05:46 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త తమవంతుగా నడుంబిగించి సభ్యత్వ నమోదు చేయాలని ఆ పార్టీ సభ్యత్వ నమోదు ఇంచార్జి సుమిత్ర తనోబ అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో అపార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షంలో పోరాటాలు చేసేందుకు సమస్యలు తెలుసుకుని తెలియజేయాలని సభ్యత్వ నమోదులో భాగంగా యువత, మహిళలు, రైతులు, కార్మికులు, ఆదివాసి గిరిజనలు, అన్ని వర్గాలను భాగస్వామ్యం చేసి గ్రామస్థాయిలో పార్టీ బలాన్ని మరింత పెంచాలని కోరారు.






