20 August, 2026 | 1:50 PM

GO నెంబర్ 97ను వెంటనే రద్దు చేసి 90ని అమలులోకి తేవాలి

20-08-2026 01:16 PM

బి ఆర్ ఎస్ వి జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్..

ఉట్నూర్, ఆగస్టు 21 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 97ను  రద్దుచేసి జీఓ 90 అమలు చేయాలని బీఆర్ఎస్ వి జిల్లా శాఖ అధ్యక్షుడు ధరణి రాజేష్(BRSV District President Dharani Rajesh) డిమాండ్ చేశారు. గురువారం ఉట్నూర్ లో జీవో 97 ను రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ ఎస్ వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆదేశల మేరకు GO నెంబర్ 97ను రద్దు చేసి 90 ని అమలు పరచాలని లాల్ టెక్డి పాల్ టెక్నిక్ కలశాల ఆవరణలో బీఆర్ఎస్ వి నాయకులు కళాశాల విద్యార్థులతో కలిసి బిఆర్ఎస్ వి జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ధరణి రాజేష్  బి.ఆర్.ఎస్.వి జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘శక్తి’ పథకం, పాలిటెక్నిక్ కళాశాలల పునర్వ్యవస్థీకరణపై విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంటుందని విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే ఇలాంటి నిర్ణయాలను ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడడం ప్రభుత్వానికి అలవాటైందని పాలిటెక్నిక్ విద్యార్థులకు B.Tech సహా ఉన్నత విద్యకు ఉన్న అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతినకూడదని జి.ఓ. నం.97 వల్ల పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ పై విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే విధంగా ప్రభుత్వం కంకణం కట్టుకుందని విమర్శించారు. ఈ శక్తి పథకాన్ని అదేవిధంగా జీవో నెంబర్ 97 ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 90 ని అమలులోకి తేవాలని కోరుతూ లేని ఎడల బిఆర్ఎస్వి తరఫున పెద్ద మొత్తంలో ఆందోళన చేస్తామని ధరణి రాజేష్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బొడ్డు నరేష్ రాథోడ్ అన్వేష్ కుమ్ర కోటేష్ కేంద్రే అశోక్ మదసు దినేష్ పవర్ రామ్ సాజిద్ తదితరులు పాల్గొన్నారు.