calender_icon.png 2 February, 2026 | 4:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్ మున్సిపల్ పై బీజేపీ జెండా ఎగరవేస్తాం

02-02-2026 02:48:07 PM

బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి.

సుల్తానాబాద్, (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్( Sultanabad Municipality)పై బిజెపి జెండా ఎగరవేస్తామని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి రాణి రుద్రమదేవి అన్నారు, సోమవారం సుల్తానాబాద్ కు వచ్చిన రాణి రుద్రమదేవికి నాయకులు, కార్యకర్తలు తెలంగాణ చౌరస్తాలో ఘన స్వాగతం పలికి, శాలువాలు కప్పి  ఘనంగా సన్మానం చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో  జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూనాయకులు ,కార్యకర్తలు బిజెపి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు.

మున్సిపల్, గ్రామపంచాయతీ లకు వచ్చే నిధులు కేంద్రం నుండే వస్తున్నాయని, ప్రజలకు నాయకులు , కార్యకర్తలు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించాలని కోరారు, ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి, రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి, మీసా అర్జున్ రావు, నాయకులు కడారి అశోక్ రావు, సౌదరి మహేందర్ యాదవ్, కాసగోని నిర్మల, కూకట్ల నాగరాజు , కందుల శ్రీనివాస్ , మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ , పుచ్చకాయల హనుమంత్ రెడ్డి, ఎల్లంకి రాజన్న , పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.