మంగనూర్ వాసి దారుణ హత్య
షాద్‌నగర్‌లో ఘటన
బిజినేపల్లి జూన్ 25 ః మండల కేంద్రానికి చెందిన అరవింద్, శివాజీ, మంగనూరు గ్రామానికి చెందిన ఎండీ హాసన్ లు దళారులుగా కూడి మండలంలోని ఆయా గ్రామా ల రైతుల నుండి మొక్కజొన్న, వరి ధాన్యా న్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. వీరిలో మంగనూర్ గ్రామానికి చెందిన ఎండీ హాసన్(30) అనే వ్యక్తి షాదునగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 22న రాత్రి హత్యకు గురైనట్లు గురువారం వెలుగు చూసింది.
స్థా నికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకా రం గత ఖరీఫ్ సీజనులో బిజినేపల్లి మండలంలోని ఆయా గ్రామాల రైతుల నుండి మొక్కజొన్న, వడ్లను ఈ ముగ్గురు పెద్ద ఎత్తు న కొన్నారు. రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు నెల రోజులుగా అప్పుడు ఇప్పుడు ఇస్తాం అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. వీరి మాటలకు విసిగిపోయిన రైతులు తాము పంట డబ్బులు తమకు ఇప్పించాలని బుధవారం బిజినేపల్లి పోలీసులను కూడా ఆశ్రయించారు. దీనిపై బిజినేపల్లి పోలీసులు విచారణ చేపడుతుండగానే హత్యకు గురైన్నట్లు అక్కడి పోలీసులు తెలిపారు.
భాగస్వాములపైనే అనుమానం..
మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల నుండి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన అరవింద్, శివాజీ, ఎండీ హాసనులు కొద్ది వారాలుగా వారికి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని డబ్బుల కోసం రైతులు ప్రతి రోజు అరవింద్, శివాజీల ఇండ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఎండీ హాసన్ వద్ద రైతులకు చెందిన కొంత పంట డబ్బు ఉండటంతో అది ఇవ్వాలని శివాజీ, అరవిందులు అడిగారు. వీరు ముగ్గురు కలిసి షాదునగర్ పట్టణంలోని ఒ వెంచరులో కలిసి మధ్య సేవించారు.
ఆ తర్వాత హాసన్ హత్యకు గురి కావడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ హత్య ఎలా జరిగింది, ఎవరెవరు చేశారనే వివరాలు తెలియరాలేదు. కానీ కుటుంబ సభ్యులు, బంధువులు అరవింద్, శివాజీలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని షాదునగర్ పోలీసులు తెలిపారు.






