28 June, 2026 | 1:50 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

జగద్గిరిగుట్టలో వ్యక్తి దారుణ హత్య

30-06-2024 12:00 AM

వివాహేతర సంబంధమే కారణం ! 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 29 (విజయక్రాంతి): జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంట్లో నిద్రిస్తున్న ఓ వ్యక్తిని కొందరు దుండగు లు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా ముప్పారం గ్రామానికి చెందిన అనిల్ (40) కొంతకాలంగా జగద్గిరిగుట్టలోని వెంకటేశ్వరనగర్‌లో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న అనిల్‌ను కొందరు దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశా రు. విషయం తెలుసుకున్న పోలీసు లు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేప ట్టారు. అనిల్‌కు 6 అంబులెన్స్‌లు ఉన్నట్లు సమాచారం. శుక్రవారం నుంచి ఇంట్లో గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. మృతు డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.