31 May, 2026 | 4:30 PM

దేశ సేవకు అంకితం కావాలి: ఎమ్మెల్యే

31-05-2026 03:59 PM

బోథ్,(విజయక్రాంతి): బజార్హత్నూర్ మండల కేంద్రానికి చెందిన బి.శ్రీనివాస్ అనే యువకుడు ఆర్మీ జమన్ గా ఎంపికయ్యారు. అయితే ఎంపికైన యువకుడిని ఆదివారం బోత్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టుదలతో ఉద్యోగం సంపాదించిన యువకులు దేశసేవ కోసం కృషి చేయాలని కోరారు. ఎంతోమంది యువకులు దేశ సేవలో వివిధ గ్రామాల నుండి ఉండడం గర్వించదగ్గ విషయం అన్నారు కార్యక్రమంలో మండల యువజన సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ ప్రభాకర్ సుకుమార్ తదితరులు ఉన్నారు