24 June, 2026 | 2:30 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

సాగర్‌లో బుద్ధ పూర్ణిమ ఉత్సవాలు

02-05-2026 02:46 AM

హాజరైన మంత్రి జూపల్లి 

నల్లగొండ, మే 1 (విజయక్రాంతి): నాగార్జునసాగర్ బుద్ధవనంలో 2570 బుద్ధ పూర్ణి మ ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై, జాతకవనంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్క్‌ను స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి, పర్యాటకశాఖ అభివృ ద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డితో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ బౌద్ధ బోధనలకు కేంద్రంగా నాగార్జునసాగర్ అభివృద్ధి కానుందని చె ప్పారు.

ఆచార్య నాగార్జునుడు మాధ్యమిక వాదాన్ని ప్రబోధించిన నాగార్జునసాగర్ లో బుద్ధవనం అంతర్జాతీయ పర్యాటక కేం ద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేయూతనివ్వనుం దన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప ర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, తెలంగాణ టూరిజం ఎండి గౌతమి, ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, పర్యాటక శాఖ డైరెక్టర్ రంజిత్ నాయక్, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జునరావు పాల్గొన్నారు.