బుద్ధి కర్శానుసారిణి!
Click Here: ప్రకృతి స్వరూపిణి.. నమోస్తుతే!
లలితా మహాభట్టారికా అనుగ్రహం ఉంటే, అమ్మవారిని సేవించే అవకాశం లభిస్తే, అమ్మ మనకు ఇవ్వలేనివి ఏవీ ఉండవు. ఏదైనా ఇవ్వగల మహాశక్తివంతురాలు. కేవలం సమర్థత ఉండి, కారుణ్యం లేకపోతే ఆ అవతారం నిరుపయోగం అవుతుంది. అమ్మవారు పరమ కారుణ్యమూర్తి. ఆ కారుణ్యమే ఎరుపుగా (ప్రభవిస్తుంది) ప్రతిఫలిస్తుంది. అందుకే, లలితాదేవి పాదాలు పట్టుకుంటే ఎక్కడ పడినా, దేనిలో పడినా, మనలను మంచి మార్గంలోకి నడిపిస్తుంది. చెడు ఆలోచన రానివ్వదు. అలా, ఏ స్థాయిలో ఎవరు ఉన్నారో ఆ విషయాన్ని తెలుసుకోవడం ఎంత కష్టమో అలా పడిపోయి దీనస్థితిలో ఉన్న కొన్ని కోట్ల జీవరాశుల స్థితిని గమనించి అందరినీ తనవైపు తిప్పుకోగలిగే శక్తి అమ్మవారికి ఉంది. ఈ శక్తి నారాయణికి మాత్రమే ఉంది. ఇక, మనం అమ్మవారి పాదాలను ప్రేమగా, భక్తిగా, గట్టిగా పట్టుకుందాం!
‘అమ్మా అని పిలువగానే మనలను ఉద్ధరించి కటాక్షిస్తుంది’ అంటూ వివరణతోసహా ఉదాహరణలతోసహా
నిరూపించగలిగే నామమే ’కరాంగుళీ నఖోత్పన్న
నారాయణ దశాకృతిః’ రాక్షసులందరినీ అవతారాల అవసరాన్నిబట్టి నిర్మూలిస్తూ విష్ణుమూర్తి విష్ణుచక్రాన్ని ప్రయోగించి చంపి వేశాడు. శక్తి చక్రం తరువాత ఈ జగత్తులో శిష్టరక్షణ, దుష్టశిక్షణ చేసేది విష్ణుచక్రమే.
ఎప్పుడైతే జగత్తులో అహంకారం పెరిగి దుర్మార్గం, హింస, పీడన, స్వార్థం, దోపిడీ, అరాచకం ఎక్కువవుతాయో అమ్మవారి కొనగోటితో అవతార పురుషులు పుడుతూనే ఉంటారు. ఈ అవతార పురుషులు ధర్మాన్ని స్థాపించి వెళతారు. ఇది ఒక చక్రం. బ్రహ్మాండంలో సృష్టిచక్రం లాగా అనంతమైన దుష్టశక్తిని అంతం చేయడం ఈ అవతార లక్షణం. ఈ లక్షణాన్ని నిరూపిస్తున్న నామమే ‘కరాంగుళీ నఖోత్పన్న నారాయణ దశాకృతిః’ అమ్మ మనలను ఆదుకునే మాతృమూర్తి, కరుణామూర్తి. కడుపునింపే అన్నపూర్ణ. ఆదిపరాశక్తి స్వరూపమే కరుణతో నిండి ఉన్నది. ఎంతటి కూృరమృగాలనైనా, రాక్షసులనైనా క్షమించి కరుణించే మాతృదేవతా స్వరూపం.
శ్రీమతి సీ విజయలక్ష్మీరాజం






