20 June, 2026 | 1:36 PM

రైతుల పక్షాన బీజేపీ పోరాటం

17-08-2024 01:17 AM

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): రుణమాఫీ కాని రైతుల పక్షాన ప్రభుత్వంపై బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో  64 లక్షల మంది అర్హులకుగాను కేవలం 29 లక్షల మం దికే రుణమాఫీ చేయడం హేయమని ఆయన విమర్శించారు. శుక్రవారం   బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 

రైతులకు రూ. 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని కానీ సగం మందికి కూడా రుణమాఫీ చేయలేద ని మండిపడ్డారు.దేవుళ్ల పేరిట ప్రమాణాలు చేసి రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. రైతులకు కాం గ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చే వర కు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని ఆయన తెలిపారు.  రుణమాఫీ, రైతు భరోసా అందని రైతులు 8886100 097, 9240015247 నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదులు చేయాలని ఆయన సూచించారు. 

కేటీఆర్ క్షమాపణ చెప్పాలి: డా.శిల్పా రెడ్డి

మహిళలపై అవమానించేలా మాట్లాడిన కేటీఆర్ క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్ఛా అధ్యక్షురాలు డా. శిల్పారెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేది పేద, మధ్య తరగతి మహిళలేనని ఆమె అన్నారు.  క్షమాపణ చెప్పకపోతే కేటీఆర్‌ను బయట తిరగనివ్వబోమని, బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అడ్డుకుంటామని హెచ్చరించారు.