21 May, 2026 | 3:16 AM

విద్యుదాఘాతంతో గేదె మృతి

21-05-2026 01:56 AM

సంస్థాన్ నారాయణపూర్, మే 20 : విద్యుదాఘాతంతో గేదె మృతి చెందిన సంఘటన నారాయణపురం మండలం అల్లందేవిచెర్వు గ్రామ పంచాయతీ పరిధిలోని నాగవారిగూడెంలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఏనుగు యాదిరెడ్డి పొలం వద్ద సర్వీసు వైరుకు ఉన్న సపోర్ట్ కేబుల్ తెగి పొలంలో పడిందన్నారు.

గ్రామానికి చెందిన ముఖ్యర్ల గాలయ్య రోజువారీగా తన పశువులను మోపుతున్న తరుణంలో వైరు తాకి గేదె అక్కడికక్కడే మృతి చెందిందన్నారు. దీని విలువ సుమారు లక్షకు పైగా ఉంటుందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.