9 August, 2026 | 2:30 AM

20 నుంచి ‘ఇందిరమ్మ’ టవర్స్‌కు లాటరీ

09-08-2026 01:28 AM
  1. 7,340 ఇండ్లకు.. 35,125 దరఖాస్తులు
  2. మరో రెండు రోజులే గడువు
  3. హౌసింగ్ బోర్డు వైస్‌చైర్మన్ వీపీ గౌతం

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): ఈ నెల 20 నుంచే హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ పథకంలో భాగంగా నిర్మించనున్న ఫ్లాట్లకు లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం లాటరీ తీయనుం ది. 7,340 ఇండ్లకు గాను ఇప్పటికే 35,125 దరఖాస్తులు వచ్చాయి. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి మరోరెండు రోజు లే గడువు ఉందని, ఏడాదిలోగా లబ్ధిదారులకు ఇండ్లను అందజేస్తామ ని హౌసింగ్ బోర్డు వైస్‌చైర్మన్ వీపీ గౌతం శనివారం తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్ల టవ ర్స్ పథకం కింద మొత్తం ఒక లక్ష ఇండ్ల ను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించనుంది. ఇందులో భాగం గా పైలట్ ప్రాజెక్టుగా ప్రతి నియోజకవర్గంలోనూ 500 ఇండ్ల చొప్పున నిర్మా ణాలను చేపడుతున్నారు. దీంతో హైదరాబాద్ క్యూర్ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న 7,340 ఇండ్ల కోసం డిమాండ్ సర్వే ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ ఇండ్ల కోసం శనివారం నాటికి 35,125 దరఖాస్తులు వచ్చాయని, ఈనెల పదో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని హౌసింగ్ బోర్డు వైస్‌చైర్మన్ వీపీగౌతం ప్రకటనలో తెలిపారు.

ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవ డానికి  ఎటువంటి కుల, ఆదాయ సర్టిఫికెట్లు సమర్పించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇండ్లు కేటాయించని పక్షం లో దరఖా స్తుదారులు చెల్లించిన ధరావతు ఫీజురూ.10,000 తిరిగి చెల్లిస్తామని ఆయన చెప్పారు. దరఖాస్తులను సమర్పించడానికి మరో రెండు రో జులు మాత్రమే గడవు ఉన్నందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయ న విజ్ఞప్తి చేశారు. 

ఏడాది లోపే ఇండ్ల అందజేత!

ఒకవైపు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తూనే, మరోవైపు ఇండ్ల కేటాయింపు, ని ర్మాణాలకు సంబంధించిన కార్యాచరణపై కూడా హౌసింగ్ బోర్డు చర్యలు తీసుకుంటున్నది. దరఖాస్తులకు ఇండ్ల కేటాయింపునకు సంబంధించిన లాటరీ ప్రక్రియను ఈ నెల 20 వ తేదీ నుంచి చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అంతేకాకుండా ఆయా ప్రాం తాల్లో ఇండ్ల టవర్స్ పనులను చేపట్టడానికి టెండర్ ప్రక్రియను కూడా చేపట్టింది. ఏడా దిలోపే ఇండ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు అందించనున్నట్లు వీపీ గౌతం వెల్లడించారు. 

నియోజకవర్గాల వారీగా..

ఖైరతాబాద్ 4,394, అంబర్‌పేట 2,357, బహదూర్ పుర -1,135, ఇబ్రహీంపట్నం -749, కూకట్‌పల్లి -5,233, కార్వాన్ -1,574 మహేశ్వరం-471, మలక్‌పేట -2,846, మల్కాజిగిరి- 1,033, మేడ్చల్-1,153, నాంపల్లి- 3,613, సనత్‌నగర్ -1,046 , కుత్భుల్లాపూర్- 4,121, రాజేంద్రనగర్- 1,496, సికింద్రాబాద్ కంటోన్మెంట్ -1,374, శేరిలింగంపల్లి- 2,530  దరఖాస్తులు వచ్చాయి. సందేహాలకు 040 సంప్రదించాలి.