21-02-2026 10:06:22 PM
– ముగ్గురిపై కేసు నమోదు
అశ్వాపురం,(విజయక్రాంతి): అశ్వాపురం టిడిపి సెంటర్ వద్ద శనివారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 12 ఎద్దులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం... హైదరాబాద్‌కు చెందిన అజ్మత్ అలీ, మహమ్మద్ అక్బర్ మరియు కొత్తగూడెంకు చెందిన మహమ్మద్ మషాద్ మహేంద్ర బొలెరో కంటైనర్ వాహనంలో 12 ఎద్దులను ఒకదానిపై ఒకటి కుక్కి హైదరాబాద్ వైపు తీసుకెళ్తుండగా గుర్తించారు.
పశువులను అనుమానాస్పద పరిస్థితుల్లో, సరైన అనుమతులు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్న పశువులను పాల్వంచ గోశాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.