calender_icon.png 11 February, 2026 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుమ్రా ఇన్.. సిరాజ్ ఔట్

11-02-2026 02:29:27 AM

టీ20 ప్రపంచకప్ లో టీమిండియా రెండో మ్యాచ్ కు సన్నద్ధమవుతోంది. అమెరికా కాస్త తడబడి గెలిచిన భారత్ ఇప్పుడు గురువారం నమీబియాతో తలపడబోతోంది. ఈ మ్యాచ్‌కు తుది జట్టులో మార్పులు జరగడం ఖాయమైంది. స్టార్ పేసర్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వనుండడంతో సిరాజ్‌పై వేటు పడనుంది. అభిషేక్ శర్మ అస్వస్థతకు గురవడంతో సంజూ శాంసన్‌కు చోటు దక్కనుంది.

  1. రేపు నమీబియాతో మ్యాచ్ 
  2. అభిషేక్‌కు అస్వస్థత
  3. సంజూకు ఛాన్స్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ప్రతీ మ్యాచ్ కీలకమే. ఎందుకంటే చిన్న జట్లను సైతం తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. షార్ట్ ఫార్మాట్ కావడంతో సంచలనాలు నమోదవడానికి ఎక్కువ అవ కాశాలుంటాయి. అందుకే భారత్ ప్రతీ మ్యాచ్‌కూ పూ ర్తిస్థాయి జట్టుతోనే బరిలోకి దిగుతోంది. పైగా అమెరికాతో మ్యాచ్‌లో మన బ్యాటర్లు ఎలా తడబడ్డారో చూశాం. సూర్యకుమార్ యాదవ్ తప్పిస్తే మిగిలిన వారంతా నిరాశపరిచారు. అందుకే రెండో మ్యాచ్‌లో పసికూన నమీబియాతోనే ఆడుతున్నప్పటకీ కీలక ఆటగాళ్లెవరకీ కూడా రెస్ట్ లేదు.

ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో ఒక మార్పు జరగడం ఖా యం గా కనిపిస్తోంది. భారత స్టార్ పేసర్ జస్ప్పీత్ బు మ్రా తుది జట్టులోకి రానున్నాడు.  వైరల్ ఫీవర్ కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన బుమ్రా ఇప్పుడూ పూర్తిగా కోలుకోవడంతో  నమీబియాపై బరిలోకి దిగనున్నా డు. ఈ నేపథ్యంలో సిరాజ్ లేదా అర్షదీప్ సింగ్‌లలో ఒకరిపై వేటు పడనుంది.

హర్షిత్ రాణా గాయంతో దూరమైన వేళ అనూహ్యంగా పిలుపు అందుకుని వచ్చిన సిరాజ్ అమెరికాపై అదరగొట్టాడు. 3 వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషిం చాడు. మరి ఫామ్‌లో ఉన్న సిరాజ్‌ను ప క్కన పెడతారా.. లేక రొటేషన్ పద్ధతిలో అర్షదీప్‌ను తప్పిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో సి రాజ్‌ను తప్పించే అవకాశాలే ఎక్కువ గా ఉన్నాయి.

మరోవైపు వాషింగ్టన్ సుందర్ గా యం నుంచి కోలుకున్నప్పటకీ తుది జ ట్టులో ఆడిస్తారా లేదా అనేది చూడా లి. ఆదివారం పాక్‌తో మ్యాచ్ ఉండడంతో వాషింగ్టన్ సుందర్ ను హడావుడిగా ఆడించే అవకాశాలు కాస్త తక్కువగానే ఉన్నాయి. ఇక అభిషేక్ శర్మ అస్వస్థత నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఓపెనింగ్ కాంబినేషన్‌ను మారే ఛాన్సుంది. ఇషాన్‌తో కలిసి సంజూ శాంసన్ ఇన్నింగ్స్ ఆరంభిం చనున్నాడు.

కివీస్‌తో సిరీస్‌లో వరుస అవకాశాలు ఇచ్చినా పూర్తిగా నిరాశపరిచిన సంజూ ఓపెనింగ్ స్థానాన్ని  ఇప్పుడు ఇషాన్ దక్కించుకున్నాడు. మిగిలిన కాంబినేషన్‌లో మార్పులు జరిగే అవకాశాలు లేదు. అయితే ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది.

ఈ నేపథ్యంలో కుల్దీప్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. ఒకవేళ బ్యాటింగ్ డెప్త్ ఎక్కువ కావా లనుకుంటే మాత్రం రింకూ సింగ్‌నే కొనసాగిస్తారు. ఇదిలా ఉంటే తొలి మ్యాచ్‌లో నిరాశ పరిచిన కీలక బ్యాటర్లు నమీబియాపై రెచ్చిపోవాలని ఎదురుచూస్తున్నారు. అభిషేక్ , ఇషాన్‌తో పాటు తిలక్ వర్మ, శివమ్ దూ బే కూడా పాక్‌తో మ్యాచ్ కు ముందు పూర్తి ఫామ్ అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. 

భారత తుది జట్టు అంచనా :

అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్షదీప్/సిరాజ్