2 June, 2026 | 4:34 PM

ఇందిరమ్మ చీరల పంపిణీ

02-06-2026 03:24 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఆయా వార్డుల్లో మంగళవారం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణంలోని గొల్లపేట్ ఎన్ రెడ్డి కాలనీ శాస్త్రి నగర్ తదితర కాలనీలో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వెలుగు సుధాకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.