12-02-2026 12:46:34 AM
కొలంబో, ఫిబ్రవరి 11 : ఆస్ట్రేలియాను గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు కీలక ఆటగాళ్లు గాయాల బా రినపడి మెగాటోర్నీకి దూరమవగా.. తాజా గా మిఛెల్ మార్ష్ కూడా గాయపడ్డాడు.
ఐ ర్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ చేస్తుండగా మార్ష్‌కు గాయమైంది. ఈ గాయం కారణంగా అతడికి కొంతకాలం విశ్రాంతి, రిహాబిలిటేషన్ అవసరమని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ఆసీస్ సెలక్టర్లు స్టీవ్ స్మిత్‌కు పిలుపునిచ్చారు. ప్రస్తుతం లంకకు బయలుదేరిన స్మిత్ గురువారం జట్టుతో కలవనున్నాడు.