పేద మధ్యతరగతి ప్రజలపై ధరల భారం పెరుగుతోంది: సిపిఎం
04-04-2026 08:34 PM
ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): అధిక ధరల వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నేతలు అబ్దుల్ నబి, ఆలేటి కిరణ్ కుమార్ అన్నారు. మండల స్థాయి సమావేశంలో మాట్లాడుతూ యుద్ధ ప్రభావంతో ధరలు 30–40 శాతం పెరిగి కొనుగోలు శక్తి తగ్గిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు నియంత్రించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. గ్యాస్, టిఫిన్ ధరలు పెరగడంతో శ్రామిక వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. మీసేవ ఛార్జీలు పెరగడం ప్రజలపై మరింత భారమైందన్నారు. ధరలు నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరారు.




