4 April, 2026 | 10:52 PM

అర్బన్ కాలనీ అంగన్వాడి కేంద్రాలకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు

04-04-2026 08:37 PM

దమ్మపేట,(విజయక్రాంతి): దమ్మపేట పంచాయితీ పరిధిలో గల అర్భన్ కాలనిలో ఇటీవల ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ గా నిర్మించిన అధునాతన అంగన్వాడీ కేంద్రంకు 11 మందితో కూడిన ప్రత్యేక కమిటీ సభ్యులుగా చైర్ పర్సన్ సర్పంచ్ పగడాల రమాదేవి, వార్డు సభ్యుడు రూపా రాంబాబు, ఆశా కార్యకర్త ఎన్. రమణ, గర్భిణి పి. రష్మి, బాలింత సి.హెచ్ కనకదుర్గ, పిల్ల తల్లులు టి.రాజ్యలక్ష్మి, పి.భారతి, ఉపాధ్యాయురాలు ఎం.డి. తస్లీమా, వి.ఓ.లు సి.హెచ్ నాగమణి, వై.బిందు, అంగన్వాడి టీచర్ ఎం.డి గౌస్య లను శనివారం నియమించారు.

ఈ ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడీల నిర్వహణ, గర్భిణీలకు, చిన్నారులకు పౌష్టికాహార పంపిణీ, ఆహారా తనిఖీ, శుభ్రత, మౌలిక సదుపాయాలు, పిల్లల హాజరు, ప్రతి నెలా సమావేశం ఏర్పాటు, అంగన్వాడీ కేంద్రం పనితీరు, మందు బిళ్ళల పంపిణి, ఆరోగ్య పరీక్షలు నిర్వహణ చేసే విధంగా  చర్యలు తీసుకుంటామని కమిటీ సభ్యులు అందరు సహకరించాలి అని, పోషకాహారం గర్భిణుల ఆరోగ్యానికి, శిశువు ఎదుగుదలకు ఎంతో అవసరమని, కేంద్రంకు కావల్సిన సదుపాయాలు ఏమి కావాలన్నా సమకూర్చుతామని  సర్పంచ్ తెలియజేశారు.

ప్రభుత్వం తరపున ఇచ్చే పోషకాహారంని లబ్దిదారులకు సర్పంచ్ రమాదేవి, వార్డు సభ్యులు రూపా రాంబాబు కలిసి పంపిణి చేశారు. పిల్లల బరువును నమోదు చేయించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పగడాల రాంబాబు వార్డు సభ్యులు పానుగంటి లక్ష్మణ్ గౌడ్, పగడాల రాంబాబు, అంగన్వాడీ కేంద్రం నిర్వాహకులు టీచర్ సి.హెచ్ సుమతి, హెల్పెర్లు సి.హెచ్ విజయ, కే.ఆదేమ్మ,  తదితరులు పాల్గొన్నారు.