8 April, 2026 | 5:11 PM

కాంగ్రెస్ పార్టీలో చేరిన బూర్గుల్ సర్పంచ్

08-04-2026 02:58 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం బూర్గుల్ గ్రామానికి చెందిన సర్పంచ్(Burgul Sarpanch) గజ్జల జీవన్,జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో(Congress Party) చేరారు. గడిచిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ(BRS Party) మద్దతు దక్కకపోవడంతోస్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు మల్లికార్జున్, మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సర్పంచ్ గంగి రమేష్,నాయకులు విజయ్ కుమార్తదితరులు పాల్గొన్నారు.