4 September, 2026 | 10:46 PM

Breaking News

ఉమ్రిలో ఘనంగా మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం   •   శిరీష కుటుంబానికి అండగా నిలవాలి   •   మద్దూరులో అభివృద్ధి పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి   •   బాన్సువాడలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు   •   హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే గండ్ర   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - యాదవుల ఐక్యతకు నిదర్శనం   •   ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఆకస్మిక తనిఖీ   •   నిజాంసాగర్ మండలం ఉత్తమ ఉపాధ్యాయులుగా బీ సమత, అజయ్ కుమార్   •   కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వనమా వంటావార్పు   •   భక్తి, ఆధ్యాత్మికతతోనే సమాజంలో ఐక్యత   •  

లారీని ఢీకొన్న బస్సు.. ఇద్దరు మృతి

01-12-2025 | 01:23am

-పలువురికి తీవ్ర గాయాలు

-ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎక్స్ రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై ఘటన

-ప్రమాద సమయంలో బస్సులో 60 మంది 

నేరడిగొండ, నవంబర్ 30 (విజయక్రాంతి): ఆగివున్న లారీని ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులు దుర్మరణం చెందగా, పలువురికి తీవ్ర గా యాలయ్యాయి. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. హైదరాబాద్ నుంచి ఉత్త ర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ వెళ్తున్న బస్సు ఆ దివారం తెల్లవారుజామున ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని బోథ్ ఎక్స్ రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని వెనుక నుంచి ఢీకొంది.

ఈ ప్ర మాదంలో ఇద్దరు ప్రయాణికుల అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. ప్రమాద స మయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన వారు ఉత్తరప్రదేశ్ వాసులుగా గుర్తించారు. ఈ రోడ్డు ప్రమాదంతో జాతీయ రహదారిపై మూడు గంటల పాటు ఎక్కడికక్కడవాహనాలు నిలిచిపోవడంతోట్రాఫిక్ స్తంభించిం ది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.