1 April, 2026 | 6:31 PM

Breaking News

బస్సు సౌకర్యం కల్పించాలి

30-06-2024 01:33 AM

మంత్రి పొన్నంకు ఖాజీపల్లి గ్రామస్థుల వినతి

పటాన్‌చెరు, జూన్ 29: ఖాజీపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ గ్రామ జేఏసీ నాయకులు న్యాయవాది, పర్యావరణవేత్త దండే రమాకాంత్ ఆధ్వర్యంలో గ్రామస్థులు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను కలిశారు. ఈ మేరకు సచివాలయంలో మంత్రికి వినతిపత్రం అందజేశారు. నాలుగేళ్ల క్రితం రోడ్డు సమస్య కారణంగా బస్సు సౌకర్యం నిలిచిపోయిందని, ప్రస్తుతం రోడ్డు సౌకర్యం మెరుగైనందున మళ్లీ బస్సు సౌకర్యాన్ని ప్రారంభించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ నుంచి వయా నిజాంపేట మీదుగా ఖాజీపల్లి వరకు, అమీర్‌పేట నుంచి వయా మియాపూర్ మీదుగా ఖాజీపల్లి వరకు గంటకో బస్సు నడపాలని మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సయ్యద్ రయీస్, కుమార్‌యాదవ్, అరికల మహేశ్ తదితరులు పాల్గొన్నారు.