7 July, 2026 | 7:33 PM

Breaking News

డిగ్రీ ప్రవేశాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానం   •   ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •   17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం   •   ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   అనగారిన వర్గాల... అభ్యున్నతి ఎమ్మార్పీఎస్ తోనే సాధ్యం   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఇందిరమ్మ ఇండ్ల వద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటు   •  

అరుణాచలం రామేశ్వరానికి బస్సు సదుపాయం

09-06-2025 04:45 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ డిపో ద్వారా ప్రయాణికుల కోసం నిర్మల్ నుండి రామేశ్వరానికి సూపర్ లగ్జరి బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ కే పండరి(Depot Manager K Pandari) తెలిపారు. నిర్మల్ నుండి అరుణాచలం, పలని, మధురై, పాతల శెంబు, రామేశ్వరం ధనుష్కోడి యాత్రలకు బస్సు నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. రామేశ్వరం వరకు బస్సు వెళ్లి తిరిగి అరుణాచలం గిరి ప్రదక్షిణ దర్శనం చేయించుకుని నిర్మల్ చేరుకుంటుందని ఆయన తెలిపారు.

ప్రయాణపు తేదీ ఛార్జి వివరాలకు 9959226003, 8328021517, 7382842582 సంప్రదించాలని తెలిపారు. అలాగే 36 మంది ప్రయాణికులు ఉంటే ఎక్కడికైనా బస్సు సౌకర్యం కలిపిస్తామని డిపో మేనేజర్ తెలిపారు. భోజన వసతి కల్పించడం జరుగుతుందని ఆసక్తి గల ప్రయాణికులు భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.