7 July, 2026 | 6:26 PM

Breaking News

"సర్" ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి   •   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •   డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు   •   విడతల వారీగా యూరియా ఇవ్వడం సరికాదు   •   మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు   •  

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ళు

09-06-2025 04:55 PM

ఎంపీడీవో రాజేశ్వర్..

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎన్ రాజేశ్వర్(Mandal Parishad Development Officer Rajeshwar) స్పష్టం చేశారు. మండలంలోని అందుగులపేట గ్రామంలో సోమవారం లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామాలలో ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఇంచార్జ్ కడారి జీవన్ కుమార్, హౌసింగ్ ఏఈ జోష్నా, కార్య దర్శి వీరేందర్, కాంగ్రెస్ నాయకులు రేగుంట రాజయ్య, వేముల భాస్కర్, చాంద్ పాషా, లింగాల మల్లయ్యలు పాల్గొన్నారు.