30 June, 2026 | 8:37 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

బస్సులు లేక జనం పరేషాన్

07-06-2025 12:32 AM

వలిగొండ, జూన్ 6 (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలో శుక్రవారం బస్సులు లేక జనం ప్రయాణానికై ప్రయాసలు పడాల్సి వచ్చింది. శుక్రవారం ఆలేరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ ఉండడంతో ఆర్టీసీ బస్సులన్నీ సభకు తరలించడం జరిగింది. దీంతో బస్సుల కొరత ఏర్పడడంతో ప్రయాణికులు తమ ప్రయాణానికి వ్యయ, ప్రయాసలు పడాల్సి వచ్చింది.

బస్సులు సరిగా లేకపోవడంతో జనం తప్పనిసరి అయి ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ప్రయాణించారు. బస్సులు లేకపోవడంతో వలిగొండ మండల కేంద్రంలో బస్సు కోసం వేచి చూస్తున్నా వారి గుంపులు, గుంపులుగా కనిపించారు.