27 April, 2026 | 7:07 PM

మండు వేసవిలో ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ

27-04-2026 03:32 PM

చిట్యాల,(విజయక్రాంతి): మండు వేసవిలో ఉపాధి హామీ కూలీలకు  మజ్జిగ ప్యాకెట్లను జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. సోమవారం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో మండు వేసవిలో ఉపాధి హామీ కూలీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉరుమడ్ల గ్రామంలో మజ్జిగ ప్యాకెట్లను  పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. గ్రామ యువజన నాయకుడు జన్నపాల రాము ముందుండి, ఉపాధి హామీ కూలీలు పని చేస్తున్న ప్రదేశంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఎండల తీవ్రత కారణంగా కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు మాట్లాడుతూ, తమ దాహాన్ని తీర్చడమే కాకుండా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పల్లపు బుద్ధుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.