27 April, 2026 | 7:10 PM

30న రుణాల కోసం ఇంటర్వ్యూ..

27-04-2026 03:35 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ఎస్సీ కార్పొరేషన్ 2025-26 ఆర్థిక సంవత్సరం రుణాల కోసం ఈ నెల 30న మునిసిపల్ కార్యాలయంలో 11గంటలకు ఇంటర్వ్యూ లు ఏర్పాటు చేసిన నట్టు బెల్లంపల్లి మునిసిపల్ కమిషనర్ సంపత్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న ఎస్సీ నిరుదోగ్య యువతీ యువకులు ఈ ఇంటర్వ్యూ కు హాజరు కావాలని కోరారు.

ఎస్సీ నిరుదోగ్య యువతీ యువకులను ఆయా బ్యాంకు మేనేజర్లు ఇంటర్వ్యూ చేసి అర్హత గల ఎస్సీ నిరుదోగ్య యువతీ యువకులకు ఎంపిక చేస్తారని తెలిపారు. ఆన్లైన్ నందు దరఖాస్తు చేసుకున్న ఎస్సీ నిరుదోగ్య యువతీ యువకులందరూ సంబందిత సర్టిఫికేట్ ఒరిజినల్, జిరాక్స్ కాపిలతో పాటు ఒక పాస్ ఫోటో తీసుకొని సకాలములో హాజరు కావాలనీ తెలిపారు. ఈ అవకాశాన్ని దరఖాస్తు చేసుకున్న యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.