ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు అందజేత
16-04-2026 02:08 PM
కోనరావుపేట ఏప్రిల్ 16 (విజయక్రాంతి): ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు అందజేసినట్లు సర్పంచ్ పసుల పోశయ్య తెలిపారు. గురువారం మండలంలోని ఎగ్లాస్పూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించి ,కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున కూలీలు అప్రమత్తంగా ఉండాలన్నారు.ఉదయం 10 గంటల లోపే పనులు ముగించుకోవాలని ,ఎండలో పని చేయకూడదన్నారు. జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేయాలని సర్పంచ్ సూచించారు అయన వెంట వార్డ్ సభ్యులు ఫీల్డ్ అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శి కూలీలు తదితరులు పాల్గొన్నారు.






