విల్లా కొంటే లంబోర్ఘిని కారు ఫ్రీ
30-10-2024 02:49 AM
కస్టమర్లకు బంపర్ ఆఫర్
జేపీ గ్రీన్స్ సంస్థ ప్రకటన
నోయిడా, అక్టోబర్ 29: పండుగల వేళ దేశంలో తమ అమ్మకాలు పెంచుకోడానికి వివిధ కంపెనీలు అనేక ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాకు చెంది జేపీ గ్రీన్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ తన అమ్మకాలను పెంచుకోవడానికి గతంలో ఎవరూ ప్రకటించని విధంగా కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. తమ వెంచర్‌లో లగ్జరీ విల్లాను కొన్నవారికి రూ. 4 కోట్ల విలువగల లంబోర్ఘిని ఉరుస్ కారును ఫ్రీగా ఇస్తామని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తమ దగ్గర రూ. 26 కోట్లు, ఆ పైన విలుగల విల్లాను కొనుగోలు చేస్తేనే ఈ ఆఫర్ వర్తిస్తుందని ఆ పోస్ట్‌లో పేర్కొంది. దేశంలో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితికి ఇది అద్దం పడుతుందని నిపుణులు అంటున్నారు.






