31 July, 2026 | 3:46 AM

రోడ్డుపై గుంతల పూడ్చివేత

31-07-2026 02:32 AM

బాలానగర్ జులై 30: మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణ పనులు రెండేళ్లుగా కొనసాగుతున్నాయి. గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు సర్వీస్ రోడ్డు పూర్తిగా దెబ్బతిని పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది.

రంగారెడ్డి గూడ నుంచి బూర్గుల వరకు జాతీయ రహదారి ఎన్హెచ్ 44 పై ట్రాఫిక్ నెలకొంది. ఈ సమస్యపై స్పందించిన బాలానగర్ ఎస్త్స్ర నరేందర్ రెడ్డి గురువారం జేసీబీ సహాయంతో గుంతల్లో మట్టి నింపించి రహదారిని తాత్కాలికంగా చదును చేయించారు. దీంతో ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గి వాహనాల రాకపోకలు సాఫీగా సాగాయి. తమ ఇబ్బందులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకున్న ఎస్త్స్ర నరేందర్ రెడ్డికి వాహనదారులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.