రోడ్డెక్కిన విద్యార్థులు..
31-07-2026 02:29 AM
సమస్యలపై కలెక్టర్ స్పందన
వనపర్తి మండలం జూలై 30: గాయత్రి పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో బస్సులు నిలపకపోవడం వల్ల గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంపై విద్యార్థులు రోడ్డుపై నిరసన తెలిపారు. విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బస్సులు నిలపకుండా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కలెక్టర్ తక్షణ స్పందనపై బంజారా గిరిజన విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు శివనాయక్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీజీవీపీ నాయకుడు రవి యాదవ్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కుమార్, మల్లేష్, వీరన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు.






