స్వామి అనుగ్రహంతో వర్షాలు సమృద్ధిగా కురవాలి
ఎమ్మెల్యే హరీశ్ రావు
నంగునూరు, జూన్ 28:నంగునూరు మండల కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి విగ్రహ పునః ప్రతిష్టా ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని,స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయ పునఃప్రతిష్టా కార్యక్రమం జరగడం ఎంతో సంతోషకరమన్నారు.ప్రస్తుతం కరువు పరిస్థితులు ఉన్నాయని వింటున్నాం,ఆంజనేయ స్వామి అనుగ్రహంతో కరువు ఛాయలు తొలగిపోయి,వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకున్నాను అని తెలిపారు.
ప్రజలందరూ సుఖసంతోషాలతో,సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన ఆయన,భవిష్యత్తులో స్వామి వారి ఆశీస్సులతో నంగునూరు ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జప శ్రీకాంత్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు లింగం గౌడ్,మండల నాయకులు రాగుల సారయ్య, రమేష్ గౌడ్,మహిపాల్ రెడ్డి,జైపాల్ రెడ్డి,మహేందర్ గౌడ్,కోల రమేష్ గౌడ్, కిష్టారెడ్డి, ఉల్లి మల్లయ్య,సర్పంచ్ సనాధుల బాల పోచయ్య,ఉప సర్పంచ్ శ్రీధర్ గౌడ్,నాయకులు,కార్యకర్తలు,ఆలయ కమిటీ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.






