29 June, 2026 | 2:03 AM

వర్షాల కోసం గ్రామ దేవతలకు జలాభిషేకాలు

29-06-2026 12:00 AM

నంగునూరు, జూన్ 28: వర్షాలు సమృద్ధిగా కురవాలని,పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలో గ్రామస్థులు ఆదివారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఎండల తీవ్రత తగ్గి ప్రకృతి కరుణిం చాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ గ్రామ పెద్దలు, యువకులు ఐక్యం గా ఈ వేడుకల్లో పాల్గొని, గ్రామ దేవతలకు జలాభిషేకం చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో  సర్పంచ్ నరేష్, ఉప స ర్పంచ్ తిప్పని శ్రీనివాస్,మాజీ సర్పంచ్ తిప్పని రమేష్, మార్కెట్ డైరెక్టర్ గాండ్ల రమేష్,గ్రామస్తులు పాల్గొన్నారు.