కోతుల సమస్యకు బోన్లు ఏర్పాటు
ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి పంచాయతీలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు కోతులతో పడుతున్న ఇబ్బంది గమనించి పంచాయతీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ నాయకుడు బత్తుల అంజి సూచనలతో పాలకవర్గ సహకారంతో శనివారం గ్రామంలో గల కోతులను పట్టడానికి ఏర్పాటుచేసిన బోనులను సర్పంచ్ కొర్సా చంద్రలేఖ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బోనుతో పట్టిన కోతులను సురక్షితంగా అడవి ప్రాంతంలో వదిలివేయనున్నట్లు ఆమె తెలిపారు.
మండలంలో మేజర్ పంచాయతీగా మండల కేంద్రంగా ఉన్న ములకలపల్లి పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలను, అవసరాలను దశలవారీగా పరిష్కరిస్తామని అన్నారు.ప్రజలు కోరుకున్న విధంగా త్వరలోనే కోతుల బెడద తీరుతుందని తెలిపారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ పువ్వాల లలితరావు, వార్డ్ సభ్యులు ముదిగొండ శ్రీను, జంపాలరమణ,వీరునాయక్,ఊకే వెంకటమ్మ,ములకలపల్లి మండల కాంగ్రెస్ నాయకులు గాదె తిరుపతిరెడ్డి,శనగపాటి రవి పసుపులేటి గణపతి, పంచాయతీ వర్కర్స్,గ్రామ పెద్దలు,ప్రజలు పాల్గొన్నారు.






