18 August, 2026 | 1:23 AM

ప్రాణం పోతే పరిహారమేనా..! చర్యలు ఎక్కడ?

18-08-2026 12:25 AM
  1. అన్ని సక్రమంగా జరిగితే.. ఆదాయంపైనే దృష్టి
  2. అభయపద ఆస్పత్రిలో రూ.3.75 లక్షలు వసూల్.. అయినా దక్కని ప్రాణం
  3. ప్రాణాలు పోయినా విచారణ చేయకుంటే ఎట్లా?

మహబూబ్‌నగర్, ఆగస్టు 17 (విజయ క్రాంతి) : మెరుగైన వైద్య సేవలు అత్యంత వేగంగా అందుబాటులో ఉంచి తమ ప్రాణాలకు ఇక భరోసా ఉన్నట్టే అంటూ ప్రవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తూ కొందరు కొన్ని ఆస్పత్రులలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

వైద్య సదుపాయాలు పూర్తిస్థాయిలో అందిస్తున్నామని చెబుతున్న ఆయా ప్రైవేట్ ఆస్పత్రులు ప్రాణాలు పోయినప్పుడు మాత్రం కొన్ని సాకులు చెబుతూ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్య కారణంగానే ప్రాణాలు పోతున్నాయని తమ కుటుంబ సభ్యుల ప్రాణాలు పోగొట్టుకున్న పలువురు వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రాణాలు పోయిన నిర్లక్ష్య ధోరణితోనే కొందరు ప్రైవేట్ ఆసుపత్రిలో యాజమాన్యాలు వ్యవహరిస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని పూర్తి విచారణ చేసి తప్పు ఎక్కడ జరిగింది? ఎలా ప్రాణం పోయిందని విషయాలను పరిగణలోకి తీసుకొని దర్యాప్తు చేస్తే బాగుంటుందని బాధ్యత కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.

అభయప్రద ఆసుపత్రిలో వ్యక్తి మృతి..

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అభయ ప్రద ఆస్పత్రిలో సోమవారం ఓ వ్యక్తి మృతి చెందారు. రాజారాపూర్ మండలం కుచ్చర్కల్ గ్రామానికి చెందిన పాండురాయ గౌడ్ మంగళవారం ఆరోగ్య  సమస్యతో ఆస్పత్రిలో చేరారు. అతని ఆరోగ్య పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఆస్పత్రి యాజమాన్యం తీవ్ర ఒత్తిడికి గురిచేసిందని,  అత్యవసరంగా స్టంట్ వేయాలని భయభ్రాంతులకు గురిచేసి రూ. 3.75 లక్షలు వసూలు చేశారని వారు కన్నీరు మునిరయ్యారు.

తర్వాత ఇంటికి పంపించాలని, ఇంటికి వెళ్లిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై ఇబ్బందులు పడ్డారన్నారు. దీంతో బంధువులు ఆస్పత్రి వర్గాలను సంప్రదించగా, ఆస్పత్రి సిబ్బంది బాధితుడిని నేరుగా వచ్చి పరిశీలించకుండా, నిర్లక్ష్యంగా వాట్సాప్లోనే మందుల చీటీలు పంపుతూ కాలయాపన చేశారని వారు చెబుతుండ్రు. చికిత్స మృతి చెందారని పూర్తి విచారణ చేసి ఆసుపత్రి పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తుండ్రు. ఆస్పత్రి వైద్యులు మాత్రం సరిగా చికిత్స చేశామని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని మృతుడి కుటుంబ సభ్యులు చెప్పారు. 

ప్రాణం పోతే పరిహారంతో సరిచేస్తుండ్రు..

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రవేట్ ఆసుపత్రిలో ఎక్కడైనా వైద్య చికిత్సలు పొందుతూ రోగుల ప్రాణాలు పోతే వారికి పరిహారంతో అంతర్లీనంగానే సరిచేస్తూ ఎక్కడ దరిదాపుల్లో కూడా ప్రచారం కాకుండా అంతర్లీనంగానే సెటిల్మెంట్లు చేస్తూ ఉండడం ఎంతవరకు సమంజసం అని పలువురు వ్యక్తులు అసహన వ్యక్తం చేస్తుండ్రు.

తప్పు చేసినప్పుడు సంబంధిత ప్రైవేట్ ఆస్పత్రి పై చర్యలు తీసుకుంటూ అధికారులు ముందుకు సాగితే బాగుంటుందని కేవలం పరిహారం అందిస్తూ కుటుంబ సభ్యులను మౌనం పాటించేలా చేయడం ఎంతవరకు సమంజసం అని బాధిత కుటుంబ సభ్యులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మరణాలు సంభవించిన సమయంలో ఉన్నత అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని జనం చెబుతున్న మాట.