17 April, 2026 | 11:13 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

సీపీఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పిలుపు

23-06-2025 12:21 AM

గద్వాల టౌన్ జూన్ 22భారత కమ్యునిస్టు పార్టీ(సిపిఐ) ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటాలు నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు ఏం బాల్ నరసింహ పిలుపు ఇచ్చారు. ఆదివారం గద్వాల జిల్లా కేంద్రంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం బి.ఆశన్న అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ బీజేపీ మోడీ  పాలనలో ఇండియా ధనవంతుల చేతులోకి వెళ్లి పేద ప్రజలు మరింత పేద ప్రజలుగా మారుతున్నారని ప్రజల అవసరాలను జీవితాలను గాలికొదిలేసి కేవలం హిందూ మతం అంటూ కాలం గడుపుతున్నారన్నారు.ప్రజలు సామాన్యుల కోసం నిరంతరం త్యాగాలు పోరాటాలు చేసే కమ్యునిస్టు పార్టీని బలపరచినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

జిల్లాలో పార్టీ నిర్మా ణం పెంచాలని అందుకోసం నాయకత్వం కృషి చేయాలని జిల్లా సమితి సభ్యులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సూచించారు. అంతకు ముందు సిపిఐ జిల్లా కార్యదర్శి బి.ఆంజనేయులు సమావేశ ఎజెండాను పార్టీ ప్రజాసంఘాల కార్యాచరణను వివరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు పెద్దబాబు, ఉప్పేరు కృష్ణ, సిద్ధప్ప, రంగన్న, కాసిం, వెంకటేష్, రామాంజనేయులు, శివ ఏఐఎస్‌ఎఫ్ ప్రవీణ్, వెంకటేష్, వివిధ ప్రజాసంఘాల నాయకులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.