28 June, 2026 | 3:13 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

ప్రజల సౌకర్యార్థం క్యాంప్ కార్యాలయం ప్రారంభం

20-04-2025 04:39 PM

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్..

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని ప్రజల సౌకర్యార్థం సీఈఆర్ క్లబ్ సమీపంలోని బి1 క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి(MLA Vivek Venkataswamy) ఆన్నారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంను ఆదివారం ఆయన పార్టీ నాయకులతో కలిసి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ కార్యాలయం ఉపయోగ పడుతుందన్నారు. పట్టణం అభివృద్ధితో పాటు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. పట్టణ, మండల ప్రజలు క్యాంప్ కార్యాలయం సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.